‘సంపంగి,16వంటి చిత్రాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక, నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రిస్క్'. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ,'రిస్క్.. టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను థియేటర్‌లో చూడా లని నిర్ణయించుకున్నాను. ఇది యువతకు బాగా నచ్చే సినిమా అనిపిస్తోంది అని తెలిపారు. ‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. ఈ సినిమాను జూన్ రెండో వారంలో విడుదల చేస్తున్నాంఅని హీరో సందీప్ చెప్పారు. దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ,'సంగీత దర్శకుడిగా నన్నెంతో ఆదరించారు. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి మంచి పాటలు అందించాను. మ్యూజి కల్‌గా కూడా సినిమా ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది. దర్శకుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చే సినిమా ఇది అని అన్నారు.
యువతని మెప్పించే’రిస్క్`
- Advertisement -
- Advertisement -



