Monday, March 2, 2026
E-PAPER
Homeజిల్లాలుమంథని అభివృద్ధికి విశేష కృషి చేసిన నాయకుడు శ్రీపాదరావు

మంథని అభివృద్ధికి విశేష కృషి చేసిన నాయకుడు శ్రీపాదరావు

- Advertisement -

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు

మంథని ప్రాతం అభివృద్ధికి విశేష కృషి చేసిన గొప్ప నాయకుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావుని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం శ్రీపాదరావు 89వ జయంతి వేడుకల్లో భాగంగా మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీపాద చౌక్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీపాదరావు మంథని ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని, ఆయన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన దిశగా తాము కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -