హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు శ్రీరాం శరత్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ జాగృతి విషయాలపై చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని తెలిపారని అన్నారు.