నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఆదివారం శ్రీరామనవమి శోభాయాత్ర హిందూ ఉత్సవ సమితి, హిందువాహిని ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ముందుగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు. శ్రీరాముని భారీ విగ్రహంతో ఆయా వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ముధోల్ భక్తి పాటలతో మారుమోగింది. యువకులు, పిల్లలు నృత్యాలు చేశారు. శోభాయాత్ర సాయంత్రం వరకు కొనసాగనుంది. ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముధోల్ సర్కిల్ సిఐ మల్లేష్ ఆధ్వర్యంలో ముధోల్ ఎస్ఐ సంజువ్, ట్రేని ఎస్ఐ శ్రావణి, 35 మంది పైగా పోలీస్ సిబ్బంది, బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే ముధోల్ లోని ఆయా కూడళ్ళ వద్ద ప్రత్యేకంగా పోలిస్ పికెటింగ్ లు ఏర్పాటు చేశారు.