
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఎక్కడో తెలియని ప్రాంతాలలో లభ్యమయ్యే స్టార్ ఫ్రూట్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లభ్యమైనది. ఆ పండ్లను స్థానిక ప్రజలు చూసి ఇవేం పనులు అని అడిగి స్టార్ ఫ్రూట్ అని తెలుసుకొని మరి కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట ఈ పనులను చూసి అక్కడి నుండి వెళ్లే ప్రజలు ఇవేం పనులన్నీ అడుగుతూ మరి తెలుసుకొని కొనుగోలు చేశారు. ఆ పండు పేరు స్టార్ ఫ్రూట్ అని తెలియచయడంతో కొనుగోలు చేశారు. అసలు స్టార్ ఫ్రూట్ అంటే ఏమిటి అని అడగగా అక్కడున్న వారితోపాటు అమ్మే మహిళ సైతం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యకమైన ఆకారంను కలిగి ఉంటుంది. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యుసీగా ఉండడమే కాదు బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. ఈ స్టార్ ప్రూట్ లో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి.స్టార్ ఫ్రూట్ చాలా మంది తినే ఉంటారు. వీటిలో పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పచ్చ రంగులో, పుల్లగా ఉంటాయి. ఈ కాయల ఆకృతిని బట్టి వీటిని స్టార్ ఫ్రూట్ అని పిలుస్తారు. కానీ ఈ పండ్లను కారంబోలా అంటారు. వీటిని ఎక్కువగా ఉష్ణమండల దేశాలలో ఎక్కువగా పండిస్తారు. ఆగ్నేయాసియా, దక్షిణ పసిఫిక్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి, బి2, బి6, బి9 విటమిన్లు, ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్, కాల్షియం, సోడియం, ఫోలేట్, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.