నవతెలంగాణ- నెల్లికుదురు
పేద ప్రజల కడుపు నింపేదికి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ప్రారంభించిందని డిప్యూటీ తాసిల్దార్ తరంగిణి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని రేషన్ షాప్ డీలర్ మద్ది బుజ్జమ్మ షాపులో సన్న బియ్యం రేషన్ కార్డుదారులకు అందించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీలర్లు ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడికి తప్పకుండా బియ్యం అందే విధంగా కృషి చేయాలని అన్నారు. సన్న బియ్యాన్ని పక్కదారి పట్టించకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రేషన్ షాపులో డీలర్లు రేషన్ కార్డు లబ్ధిదారులను ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో,రమాదేవి,చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.