జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 

Sorghum purchasing centers openedనవతెలంగాణ – నిజాంసాగర్ 
ప్రాథమిక వ్యవసాయా సహకార సంఘం అచ్చంపేట్ పరిధి లోని  వెల్గనూరు గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సకాలంలో జొన్నలను తేమశాతం 14 శాతం మించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన సూచించారు. క్వింటాలుకు రూ.3371 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఎకరానికి 8 క్వింటల జొన్నలు కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, ఆనంద్ కుమార్, వెంకటేశ్వర్లు, సంఘ సీఈవో సంగమేశ్వర్ గౌడ్, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love