Magazines

రైతు మహాసభ
జయప్రదం కోసం 2కే రన్

3 గంటల క్రితం

2K Run for the
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రారంభించిన జూలకంటి రంగారెడ్డి

నవ తెలంగాణ- మిర్యాలగూడ టౌన్

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈనెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న రైతు సంఘం జాతీయ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో 2కే రన్ నిర్వహించారు. రైతు సంఘం జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతోపాటు కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా రాజీవ్ చౌక్ ద్వారా సాగర్ మెయిన్ రోడ్‌‌లో రన్‌ ను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మహాసభను విజయవంతం చేయాలని, 15న జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో రైతులు, మేధావులు, ప్రజాప్రతినిధులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్, రైతు సంఘం జిల్లా ప్రాధాన కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు రవి నాయక్, వినోద్ నాయక్, మల్లు గౌతమ్ రెడ్డి , పాండు, ఎర్ర నాయక్, ఐద్వా నాయకులు అరుణ, గోవర్ధన, కరిమున్నీసావేగం, జానకి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్