డీలిమిటేషన్‌‌తో ఆదివాసీలకు అన్యాయం

1 గంట క్రితం

Adivasis
avatar
balaji

ప్రచురించబడింది నవం 30, 2026 | 3 నిమిషాల చదవడం

2011 జనాభా లెక్కల ప్రకారం చర్చ జరగనుంది

‌ప్రస్తుత జనాభా ఆధారంగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయి

ఏఏఆర్‌ఎం జాతీయ వైస్‌ ‌చైర్‌‌పర్సన్‌ ‌బృందాకరత్‌

ముగిసిన టీఏజీఎస్‌ 4వ రాష్ట్ర ‌ప్రతినిధుల సభ

ఏకగ్రీవంగా 41 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక


నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ‌ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2011 జనాభ లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌ ‌బిల్లును ప్రవేశపెట్టి చర్చించనుందని, ఒక వేల ఈ బిల్లు రాజ్య సభలో ఆమోదం తెలిపితే ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ​ఆదివాసీ అధికారి రాష్ట్రీయ మంచ్ (ఏఏఆర్ఎం) జాతీయ వైస్‌ ‌చైర్‌‌పర్సన్‌ బృందాకరత్ అన్నారు. తెలంగా ణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్‌) 4‌వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆదివారం రెండువ రోజు ఆసిఫాబాద్‌ ‌జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాపురావు అధ్యక్షతన నిర్వహించిన ప్రతినిధుల సభ అట్టహాసంగా ప్రారంభమైంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మీడియం బాబూరావు సంఘం జెండా ఎగురవేసి ప్రతినిధుల సభను ప్రాంభించారు. ఏఏఆర్‌ఎం జాతీయ వైస్ చెర్మైన్ బృందాకరత్తో పాటు, సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆదివాసీ అమరవీరులు సమ్మక్క సారక్కలు, రాంజీగోండ్‌, బిర్సాముండా, కుమురంభీం, కొమురం సూరు, కుంజా బొజ్జు, సున్నం రాజయ్య, నైతం రాజుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.


అనంతరం జరిగిన సభలో బృందాకరత్‌ మాట్లాడారు. 2026 జనాభా ప్రాతిపదికన ‌డీలిమిటేషన్ చేపడితే ఆదివాసీ పార్లమెంట్, శాసనసభ రిజర్వుడ్ స్థానాలు పెరుగుతాయన్నారు. ప్రస్తుతం దేశవ్యాపితంగా కేవలం 47 ఎంపీ స్థానాలు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉంటే ఎస్టీలకు కేవలం 2 స్థానాలు మాత్రమే రిజర్వుడ్ చేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పదవుల్లోనే కాకుండా ఉద్యోగ నియామకాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కూడా కేవలం 12 సీట్లు మాత్రమే ఎస్టీలకు కేటాయించడం ఆదివాసులను అధికారానికి దూరం చేయడమే అవుతుందని అన్నారు. ఆదివాసీ ఉద్యోగుల ఉద్యోగోన్నతులు కల్పించే విషయంలోనూ అన్యాయం జరుగుతోందన్నారు. ఉద్యోగ ఖాళీలు కూడా భర్తీ చేయడం లేదన్నారు. అవుట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీలో కూడా ఎలాంటి రిజర్వేషన్ పద్దతి పాటించడం లేదని విమర్శించారు.


ఆదివాసీ చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కుతూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నదన్నారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ విదహనాలు పూర్తిగా ఆదివాసులకు అన్యాయం చేసేవి‌దంగా ఉన్నాయన్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివాసులు పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఆదివాసీ పోరాటాలను అభినందించారు. ఆదివాసుల సమస్యల పరిష్కారానికి ఆదివాసీ అధికారి రాష్ట్రీయ మంచ్‌ 15 రాష్ట్రాల్లో తమ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో మహాసభలు పూర్త‌య్యాక దేశవ్యాప్తంగా సమ్మేళన సభ నిర్వహించి ఆదివాసుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌ ‌కార్యచరణ రూపొందించి పలు తీర్మానాలు చేయబోతున్నామని వెల్లడించారు. మోడీ పరిపాలనలో కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ మారిన గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం ఆదీవాసులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.



టీఏజీఎస్‌ నూతన కమిటీ ఎన్నిక

రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా

మిడియం బాబురావు, పూసం సచిన్‌

వీరితో పాటు 41 మందికి చోటు


Adivasis

​టీఏజీఎస్‌ నూతన కమిటీ ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ ఎంపీ డాక్టర్‌ ఎం బాబురావు, ప్రధాన కార్యదర్శిగా పూసం సచిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి రవికుమార్(రాష్ట్ర కేంద్రం), పి సోమయ్య(రాష్ట్ర కేంద్రం), సున్నం గంగా(భద్రాచలం), దుగ్గి చిరంజీవి(ములుగు). ఎర్మా వున్నం(మంచిర్యాల), కోట శ్రీనివాస్(కుమురంభీం ఆసిఫాబాద్) ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా కొట్నాక్ సక్కు(ఆదిలాబాద్), నేర్పేల్లి అశోక్(కుమురంభీం ఆసిఫాబాద్), తొడసం శంబు(నిర్మల్), పొలం రాజేందర్(భూపాలపల్లి) ఎన్నికయ్యారు. కోశాధికారిగా కారం పుల్లయ్య(భద్రాద్రి) ఎన్నుకున్నారు. అదే విధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గౌరీ నాగేశ్వరావు(భద్రాద్రి), మడవి రమేష్ (భద్రాద్రి), సరియం కోటేశ్వరావు(భద్రాద్రి), ఉయిక విష్ణు(ఆదిలాబాద్), కుంర భీంరావు(ఆదిలాబాద్), పెందూర్ గోవింద్(ఆదిలాబాద్), కనక మలుకు(ఆదిలాబాద్), మహిళా(కో ఆప్షన్) జేజ్జరి దామోదర్ (ములుగు), కుర్నం శాంతి కుమారి(ములుగు), మడకం రాజు(ములుగు), గొంది రాజేష్(ములుగు), కాపుల వెంకటేశ్వర్లు(ములుగు), మర్మల మల్లేశ్వరి(మంచిర్యాల), భాగలా రాజన్న(మంచిర్యాల), మేకల రాజు(భూపాలపల్లి), కల్వపల్లి కల్పన(భూపాలపల్లి), ముఠా సోని(నిర్మల్), ఆత్రం బాపూరావు(నిర్మల్), తుడి కృష్ణారెడ్డి(రాష్ట్ర కేంద్రం), మాలశ్రీ (కుంఠం భీం ఆసిఫాబాద్), ఈసం ప్రవీణ్ (మహాభూబాబాద్), నక్క సైదులు (మహబూబాబాద్) ఎన్నికయ్యారు.









ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్