అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వడానికి సుముఖం

1 గంట క్రితం

Open to providing house sites to eligible journalists
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 30, 2026 | 2 నిమిషాల చదవడం

హెల్త్‌‌కార్డులిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి

అవాస్తవాల ప్రచారంతో సమాజానికి చేటు

ప్రెస్‌‌క్లబ్‌ ఫ్యామిటీ గెట్‌‌టూ గెదర్‌‌లో మంత్రులు ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, శ్రీధర్‌‌బాబు, జూపల్లి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మెరుగైన సమాజ నిర్మాణం కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సుముఖంగా ఉన్నారని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు, జూపల్లి కృష్ణారావు హామీనిచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మొయినాబాద్ లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ లో జర్నలిస్టుల ఫ్యామిలీ గెట్- టు-గెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముగ్గురు మంత్రులు విచ్చేశారు. అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులను కూడా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ స్థలాన్ని లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీనిచ్చారు. ప్రతి ఏటా కార్తీకమాసంలో నిర్వహించే ఫ్యామిలీ గెట్- టు- గెదర్ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసానిచ్చారు. సోషల్ మీడియాలో వాస్తవాలను చూపించాలని విన్నవించారు. అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల సమాజానికి చెడు జరుగుతుందని చెప్పారు. సమాజానికి మేలు చేసే విధంగా వార్తా ప్రసారాలుండాలని సోషల్ మీడియా కోరారు. రాష్ట్రచలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు, సినీ నటులు ఆలీ దంపతులు, ప్రముఖ గాయకులు ఆర్‌‌పీ పట్నాయక్, కౌసల్య, ఉష, కాసాల నర్సిరెడ్డి ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. తమ పాటలతో అలరించారు. జర్నలిస్టుల పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహమతులు అందజేశారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ కళా బృందాలు పలు కళారూపాలను ప్రదర్శించారు. మంత్రులను, అతిథులను ప్రెస్‌‌క్లబ్‌ ‌పాలకమండలి సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ‌ప్రెస్‌‌క్లబ్‌ అధ్యక్షులు ఎస్. విజయకుమార్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు ఏ.రాజేష్, అరుణ అత్తలూరి, సంయుక్త కార్యదర్శులు చిలుకూరి హరిప్రసాద్, వి. బాబురావు, కోశాధికారి రమేష్ వైట్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు ఎన్. ఉమాదేవి, మర్యాద రమాదేవి, రాజేశ్వరి కళ్యాణం, శంకర్ శిగ, వనం నాగరాజు, ముత్యాల సత్తిబాబు, ఎన్. శ్రీనివాస్ రెడ్డి, దయ్యాల అశోక్, రచన ముడుంబై, అమిత్ బట్టు, టీడబ్ల్యూజేయూ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్‌ అలీ, సీనియర్‌ ‌జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్