నవతెలంగాణ – హైదరాబాద్:
ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన లేడీస్ హాస్టల్‌లోని చాకలి ఐలమ్మ వర్సిటీ విద్యార్థినులు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓయూ లేడీస్-02 బ్లాక్‌లో ఉంటున్న విద్యార్థినులకు గత కొన్ని రోజులుగా తాగునీటితో పాటు నిత్యావసరాలకు ఉపయోగించే నీరు కూడా సరిపడా సరఫరా కావడం లేదు. దీంతో విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థినులు బుధవారం రాత్రి ఓయూ లేడీస్ హాస్టల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించి, హాస్టల్‌కు నిరంతర నీటి సరఫరా అందించాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)