ఆర్టీసీ అధికారులకు ఎస్‌డబ్ల్యూఎఫ్ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ కండక్టర్ ప్రవళ్లిక అంత్యక్రియలకు హాజరైన రోజు వేతనాలను ఉద్యోగులకు చెల్లించాలని ఉన్నతాధి కారులకు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈమేరకు సోమవారం హైదరాబాద్ లోని బస్‌భవన్‌లో ఉన్న ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)కి వినతిపత్రం సమర్పించింది. మణుగూరు డిపో కార్మికులందరితో పాటు, ఇతర డిపోలలో డ్యూటీ దొరకని వారికి కూడా నవంబర్ నాలుగున జీతాలు చెల్లించడం లేదా స్పెషల్ కాజువల్ లీవ్ గా పరిగణించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు కోరారు. ఈ మేరకు సానుకూలంగా పరిశీలిస్తామని ఈడీ హామీనిచ్చారు.







కామెంట్‌లు (0)