Magazines

‌తహశీల్దార్లకు 
డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు

27 నిమిషాల క్రితం

Promotions of Tahsildars to Deputy Collectors
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

దస్త్రంపై సీఎం రేవంత్‌‌రెడ్డి సంతకం

నేడో, రేపో ఉత్తర్వుల జారీ

రాష్ట్ర ప్రభుత్వానికి ట్రెసా కృతజ్ఞతలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న తహ‌శీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించే దస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి సంతకం చేసినట్టు తెలిసింది. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) కృషి ఫలితంగా రెవెన్యూ శాఖలో 25 మంది తహ‌శీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించనుంది. గురు లేదా శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసే అవకాశమున్నట్టు సమాచారం. వారితోపాటు మరి కొంతమంది తహశీల్దార్లకు కూడా పదోన్నతుల కల్పన కోసం ట్రెసా కృషి చేస్తున్నది. ఈ సందర్బంగా ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు కె గౌతమ్ కుమార్, గౌరవాధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్ రమన్ రెడ్డి, ఉపాధ్యక్షులు నిరంజన్ రావు, రాష్ట్ర కో ఆర్డినేటర్ నారాయణ్ రెడ్డి తదితరులు సీఎంఓ ముఖ్యకార్యదర్శి వి శేషాద్రిని, రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ డీఎస్‌ లోకే‌శ్‌ కుమా‌ర్‌‌ను బుధవారం సచివాలయంలో కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు ప్రకటించారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్