Magazines

గల్లంతైన 16 మంది సురక్షితం

1 గంట క్రితం

missing
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

బేతుపల్లి ఘటనపై ఉత్కంఠకు తెర
అర్ధరాత్రి సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్


నవతెలంగాణ-సత్తుపల్లి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్దచెరువు వద్ద బుధవారం సాయంత్రం మొదలైన ఉత్కంఠ చివరకు సుఖాంతమైంది. చెరువులోచిక్కుకున్న ఎనిమిది మంది మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బృందం పడవ బోల్తా పడింది. దీంతో మత్స్యకారులతో పాటు సహాయక బృందం కూడా చెరువులోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. చీకటిని సైతం లెక్కచేయకుండా అర్ధరాత్రి వేళ సాహసోపేతంగా వ్యవహరించి మొత్తం 16 మందిని ఒడ్డుకు చేర్చారు. సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అందరూ క్షేమంగా బయటపడ్డారు. ​క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎమ్మెల్యే నిరంతర పర్యవేక్షణ ​​సంఘటన జరిగినప్పటి నుంచి కలెక్టర్ దివాకర టీఎస్, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రాత్రంతా చెరువు వద్దే ఉన్నారు. పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తూ బాధితుల కుటుంబాలకు ధైర్యాన్ని అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు అందించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ చర్యలను సమన్వయం చేశారు. ​​రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మంత్రి అభినందించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది చూపిన ధైర్యసాహసాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి కృషిని, జిల్లా అధికారుల పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం తరఫున రెస్క్యూ బృందాలన్నింటికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్