Magazines

రూ.169 కోట్లతో సైబరాబాద్‌లో ట్విన్ టవర్ గ్రీన్ ప్రధాన కార్యాలయం

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నెట్‌జీరో ప్రమాణాలతో అత్యాధునిక భవన

నిర్మాణానికి.. టెండర్లు ఆహ్వానించిన సీఎంసీ

నవతెలంగాణ-శేరిలింగంపల్లి

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శాశ్వత ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఈ-టెండర్లను ఆహ్వానిస్తూ సీఎంసీ కమిషనర్‌ ‌సృజన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్‌లోని కొత్త కుంట చెరువు సమీపంలో 4.11 ఎకరాల విస్తీర్ణంలో రూ.169 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ట్విన్ టవర్ నెట్‌జీరో గ్రీన్ బిల్డింగ్‌గా ఈ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. మొత్తం 2,41,540 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో రెండు టవర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఒకటి G+6, మరొకటి G+8 అంతస్తులతో ప్రాజెక్టు చేపట్టనున్నారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు కౌన్సిల్ హాల్, ప్రజావాణి హాల్, పౌర సేవా కేంద్రాలు, ఆడిటోరియం, సమీకృత కమాండ్ సెంటర్‌తో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణహిత నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం, ఇంధన సామర్థ్య సదుపాయాలు, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నారు. నెట్‌జీరో ప్రమాణాలను సాధించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. సుస్థిర పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజాకేంద్రిత పాలనకు ప్రాధాన్యతనిస్తూ నిర్మించనున్న ఈ భవనం సైబరాబాద్‌కు ఒక ఐకానిక్ సివిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలవనుంది. భవిష్యత్‌ పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ఆధునిక, సమర్థవంతమైన కేంద్రంగా సేవలందించనుంది. టెండర్ల పూర్తి వివరాల కోసం తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సై‌ట్‌ https://tender.telangana.gov.in/login.html సంప్రదించాలని కమిషనర్‌ సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్