నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల నడుమ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు పెద్దఎత్తున నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఈ ప్రభావం నేడు దేశీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. దీంతో సూచీలు తొలుత స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.