
చండూర్ మున్సిపల్ కేంద్రంలో ఆగిపోయిన రోడ్డు నిర్మాణ, ఇరువైపులా డ్రైనేజ్ పనులు వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ గాంధీజీ సేవా సమితి ఆధ్వర్యంలో 100 మంది పైగా సంతకాలు సేకరణ చేసి సోమవారం చండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇన్చార్జి అరుణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ కమిటీ అధ్యక్షులు గండూరి నర్సింహ ముదిరాజ్, ఉపాధ్యక్షులు యం.డి.రఫీ లు మాట్లాడుతూ 2023 ఉప ఎన్నికల సందర్భంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి, రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయకుండా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. డ్రైనేజీలో మురుగునీరు పోకప్రధాన రహదారు పైదుర్వాసన వెదజల్లుతుంది అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, బాటసారులకు, వాన దారులకు ఇబ్బందులు కలకుండా త్వరితగతిన పనులు చేపట్టాలని వినతి పత్రంలో కోరారు.