రేషన్ బియ్యం అమ్మితే కఠిన చర్యలు: సీఐ

నవతెలంగాణ – పెద్దవూర
రేషన్ డీలర్లు బియ్యాన్ని వినియోగదారులకు కాకుండా ఇతరులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నాగార్జున సాగర్ సీఐ బీసన్న హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయం లో రేషన్ డీలర్లు తో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన బియ్యాన్ని ఎవరైనా ఇతరులకు అమ్మినా, కొనుగోలు చేస్తే  జైలుకు పంపడం ఖాయమని అన్నారు.అలాగే వినియోగదారులు ఎవరికైనా రేషన్ బియ్యం అమ్మినట్లు తెలిస్తే కార్డు రద్దు చేయడం తోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామం లో ఎవరైనా రేషన్ బియ్యం కొనుగోలు చేయుటకు మీ గ్రామాలకు వస్తే సమాచారం అందించాలని తెలిపారు. తెలియ జేసిన వారి వివరాలు ఎవరికీ తెలియనీయమని అన్నారు. తెలంగాణ లో ప్రజా పంపిణి వ్యవస్థ అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వం లక్ష్యం అని ఈ విషయమై ప్రజలు, రేషన్ డీలర్లు, వినియోగదారులు సహకరించగలరని కోరారు.ఈ కార్యక్రమం లో ఎస్ తహసీల్దార్ సరోజ పావని, డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి,ఎస్ఐ వీరబాబు,ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది, రేషన్ డీలర్లు ఉన్నారు.
Spread the love