
అటవి జంతువుల వేటకు విద్యుత్ తీగలను ఉపయోగించిన నిమ్మగూడెం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు పట్టుకొని ఎమ్మార్వో ముందు మహా ముత్తారం పోలీసులు బైండోవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై దాసరి సుధాకర్ మాట్లాడుతూ అడవి జంతువులను వేటాడుటకు పంట పొలాల చుట్టూ రక్షణ కోసం విద్యుత్ తీగలను ఉపయోగించకూడదని, పోలీసు వారు హెచ్చరించడమైనది. ఎవరైనా ఆ విధంగా వాడుతున్నట్టు తెలిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనడతాయని, ఎలాంటి ప్రమాదం జరిగినట్లయితే, ఆ ప్రమాదానికి కారణకుడైన వారిపై రౌడీషీటు నమోదు చేయడం జరుగుతుందని, వారిపై హత్యా నేరం మోపడం జరుగుతుందని హెచ్చరించడమైనది.