
– 6 నెలల బకాయి వేతనాలందించాలని వినతి
నవతెలంగాణ – బెజ్జంకి
గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని..కాలయాపన చేస్తే ఈ నెల 19 నుండి సమ్మెబాట వేస్తామని మండల గ్రామ పంచాయతీ సిబ్బంది ఐక్య సంఘం కార్యవర్గ సభ్యులు ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ ప్రవీన్ కు గ్రామ పంచాయతీ ఐక్య సంఘం కార్యవర్గ సభ్యులు 6 నెలల బకాయి వేతనాలందించి సమస్యలు పరిష్కరించాలని సమ్మెనోటీస్ అందజేశారు. మండలాధ్యక్షుడు అశోక్,గౌరవాధ్యక్షుడు బోనగరి లక్ష్మన్,శివ,వినోద్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.