మున్సిపల్ కమీషనర్ కి సమ్మె నోటీసు అందజేత

Strike notice served on Municipal Commissionerనవతెలంగాణ – సిరిసిల్ల టౌన్ 
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల ఈనెల 10 నుండి సమ్మె దిగుతామని, సమ్మెకు సంబంధించి నోటీసుని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి మంగళవారం అందజేశారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులకు రావలసిన 5 నెలల పిఆర్సి బకాయి లు, పిఎఫ్ తదితర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించు కోలేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పది తేదీ నుండి సమ్మె చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సుల్తాన్ నర్సయ్య, కార్యదర్శి కాసారపు శంకర్, బాబా కిషన్, వేణు, మల్లేశం, శ్రీనివాస్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love