సీజనల్ వ్యాధుల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి

నవతెలంగాణ – చండూరు  

ఆరోగ్య రహిత జి.పి.లుగా తీర్చిదిద్దటమే మన ముందున్న లక్ష్యమని అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ఎంపీపీ అవ్వారి గీత   శ్రీనివాస్, జడ్పిటిసి కర్నాటి వెంకటేశం  సూచించారు. గురువారం  స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో  చివరి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  వర్షాకాలం మొదలైనందున జీ.పీ.లలో ఎక్కడ కూడా జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులతో పాటు గ్రామ, మండల స్థాయి అధికారులు కలసి పనిచేస్తూ నివారణకు కృషి చేయాలని సూచించారు.  గ్రామాలలో ప్రాథమిక ఉన్నత  పాఠశాల,  హైస్కూల్లో పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రత్యేక అధికారులదే అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలలో కుక్కలు బేడతా ఎక్కువగా ఉందని, కుక్కల్ని నివారించాలని  సభ  దృష్టిని ఎంపీటీసీలు  తీసుకొచ్చారు.  బోడంగి పరిధిలో  మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని సభ దృష్టికి  ఎంపీటీసీ  లు తీసుకొచ్చారు.  ఎంపీటీసీల, జెడ్పీటీసీల పదవి కాలం ముగుస్తున్నప్పటికీ, ప్రజల్లో కలిసిమెలిసి ఉండే విధంగా ఉండాలన్నారు.  అనంతరం ఎంపీపీ, ఎంపీటీసీ లకు సన్మానం చేశారు. అధికారులు ప్రజా ప్రతినిధులకు సన్మానం  చేసి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమం లో  జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీడీఓ వి ల్ అనురాధ, తహసీల్దార్ దశరథ, డిప్యూటీ తహసీల్దార్ నిర్మలా దేవి, ఎంపీటీసీ లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love