విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి

– అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ సభ్యులు డాక్టర్‌ రఫీ
– మలక్‌పేట్‌లోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ సందర్శన
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యార్థులు వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని, వాటి ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిం చేలా చూడాలని అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ సభ్యులు డాక్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ రఫీ అన్నారు. శుక్రవారం మలక్‌పేట్‌లోని స్థానిక పాఠశాల లోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రఫీ మాట్లాడుతూ విద్యార్థులు మొదటగా తమ ఆలోచనను రాసిన తర్వాత ఎలక్ట్రానిక్‌ పరికరా లను ఉపయోగించి మోడల్‌గా తయారు చేయాలన్నారు. విద్యార్థులలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలయ్యే అవకాశముందని.. ఉద్యోగాలను సృష్టించగలిగే సామర్థ్యం కలిగిన వారు ఉన్నారని.. ఉపాధ్యాయులుగా వాటిని వెలికి తీయడమే మన బాధ్యత అని గుర్తు చేశారు. అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లో ప్రతి ఉపాధ్యాయుడు తమ వంతు బాధ్యతగా పనిచే యాలని, విద్యార్థులను వినూత్నంగా ఆలోచించి ప్రాజెక్టులు చేసేలా ప్రోత్సహించాలన్నారు. దీనిలో సామాన్య శాస్త్ర ఉపాధ్యాయ కాకు ండా.. అందరూ ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరూ సమిష్టి బాధ్యతగా తీసుకొని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లో ప్రయోగాలు చేయించి మంచి ఫలితాలు సాధించి తద్వారా విద్యార్థు లలో ఆవిష్కరణలకు అవకాశం కల్పించాలని హిమాయత్‌నగర్‌ మండలం ఉపవిద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి కోరారు. జిల్లా సైన్స్‌ అధికారి ధర్మేందర్‌ రావ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ జిల్లాలోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లో ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఒక సమావే శం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్‌ మండలం ఉప విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, మెంటర్‌ మనోజ్‌, అనిల్‌, సైన్స్‌ టీచర్లు రాము, వెంకటరెడ్డి, వనజ పాల్గొన్నారు.

Spread the love