
నవతెలంగాణ – ధర్మారం
గురుకుల పాఠశాల విద్యార్థులు రీజనల్ వ్యాధుల బారిన పడకుండా స్వచ్ఛత పరిశుభ్రత పార్టీ వ్యక్తిగత పరిశుద్ధ పాటించి అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అయినాల ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం రోజు జు స్వచ్చ శుక్రవారంలో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐనాల ప్రవీణ్ కుమార్ మండల పంచాయతీ అధికారి రమేష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖి చేసి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ దేవసేనతో పాటు పాఠశాలలోని వంట గది పరిసరాలను పరిశీలించి, వంట సామాను సంంధించిన స్టాక్ వివరాలను పరిశిలించారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రభలే విధానాలను, వ్యక్తిగత పరిశుబ్రత పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ పరిసరాలను సందర్శించి అపరి శుబ్రత గల ప్రదేశాలను గుర్తించి పరిశుబ్రత చేపట్టుటకు గాను పంచాయతి కార్యదర్శి సతీష్ కి తగు సూచనలు చేశారు .ఈ కార్యక్రమము లో మండల పంచాయతి అధికారి కె.రమేష్, ఉపాధి హామీ ఏపీఓ రవి, మల్లాపూర్ గ్రామ పంచాయతి కార్యదర్శి సతీష, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ దేవసేన, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.