మండల కేంద్రంలోని గురుకుల వసతి గృహాన్ని శుక్రవారం రోజున మండల ప్రత్యేక అధికారి కిషన్ తనిఖీ చేశారు.వసతి గృహంలో ఉన్న ప్రతి గదిని పరిశీలించి వసతి గృహంలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని వార్డెన్ను సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మంచి చదువును బాగా అందించినప్పుడే వారి భవిష్యత్ బాగుపడతారని తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి కష్ట పడి చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా ఎదగాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజ నాలు అందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్ర మంలో గురుకుల ప్రిన్సిపల్ సునీత,ఎమ్మార్వో దశరథ్,ఎంపీడీవో లక్ష్మీకాంతరెడ్డి,పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్,అధికారులు,హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.