విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలి

– కరస్పాండెంట్ మారగాని వెంకట్ గౌడ్
నవతెలంగాణ – నూతనకల్
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలని నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్, మారగాని వెంకట్ గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఐ ఎల్ ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నాగార్జున ఉన్నత పాఠశాల పదవ తరగతి వీడ్కోలు సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించి పాఠశాలకు లకు , తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. నైపుణ్యం ఎవరి సొంతం కాదని దానికి పేదరికం అసలే అడ్డు కాదని అన్నారు అబ్దుల్ కలాం పేపర్ బాయ్ నుండి ప్రముఖ శాస్త్రవేత్తగాను దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతిగా పదవులను సాధించాడని అతని జీవితాన్ని నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొవాలని కోరారు. కష్టపడి చదివి  పదవ తరగతిలో వార్షిక బోర్డు పరీక్షలు లో 10 జీపీఎ సాధించిన ప్రతి విద్యార్థికి పదివేల రూపాలు ప్రోత్సాహక బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు అనంతరం  విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురుని అల్లరింప చేశాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మారగాని విజయలక్ష్మి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు గుర్రం యాదగిరి బిక్కి రామన్న ,రాజేశ్వరి, యశ్వంత్, వీరన్న, మతిన్, సాయిరాం, శ్రీలత ,మౌనిక, రాజేశ్వరి, నవ్య ,యాశ్విన్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love