విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పదవ తరగతి పరీక్షలు రాయాలని మంచిర్యాల జిల్లా జడ్పీ సీఈవో గణపతి అన్నారు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న దశలో విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్నింపడానికి జన్నారం మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ లో బుధవారం రాత్రి బస చేసి విద్యార్థులకు పలు సూచనలు సలహాలు అందించారు. విద్యార్థులకు పై చదువులు చదవటానికి పదవ తరగతి అనేది తొలి మెట్టు అన్నారు. భయపడకుండా పదవ తరగతి పరీక్షలు రాసి మొదటి స్థానంలో ఉత్తీర్ణులు కావాలన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని సూచించారు కార్యక్రమంలో డిబిసిడిఓ పురుషోత్తం, ఉపాధ్యాయులు కొండ్రు జనార్ధన్, రిసోర్స్ పర్సన్ అశోక్ పంచాయతీ కార్యదర్శి రాహుల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.