పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు

Students visited the Turmeric Research Centerనవతెలంగాణ –  కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులోని ఆచార్య కొండ లక్ష్మణ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం, పసుపు పరిశోధన స్థానాన్ని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థులు గురువారం సందర్శించారు. పాఠశాలకు చెందిన 6,7,8,9 తరగతులకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు ప్రత్యేక వాహనాల్లో పరిశోధన స్థానం సందర్శనకు తరలివచారు. పసుపు పరిశోధన స్థానం సందర్శనకు విచ్చేసిన విద్యార్థులకు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పసుపు పంట సాగుపై అవగాహన కల్పించారు.పసుపులో లభించే కురుకుమిన్ పరీక్షించే విధానం, పసుపులో రకాలు, సాగు విధానం గురించి వివరించారు. పరిశోధన కేంద్రంలో నూతన పసుపు వంగడాల అభివృద్ధిలో భాగంగా సాగు చేస్తున్న వివిధ రకాల పసుపు రకాలను విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో పసుపు సాగులో ఉపయోగించే వివిధ తయారుచేసిన నూతన యంత్రాల గురించి క్షేత్రస్థాయిలో వాటి పనితీరును విద్యార్థులకు వివరించారు.కార్యక్రమంలో శాస్త్రవేత్త భాస్కర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, కల్లూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love