
రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులు గత సంవత్సరం2024 నవంబర్ నుండి ఈ సంవత్సరం 2025 మార్చి వరకు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించనవారు ఇంకా నిజామాబాద్ జిల్లాలో 1000 మందికి పైగా ఉన్నారని వివిధ కారణాల మూలంగా వారి లైఫ్ సర్టిఫికెట్లు అప్డేట్ కాలేదని వారు వెంటనే టీ యాప్ ఫోలియో ఆన్లైన్లో వెంటనే సమర్పించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు శుక్రవారం తెలిపారు. వారు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించనట్లయితే ఏప్రియల్ నుండి వారి పెన్షన్ నిలుప వేయబడుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా 85 సంవత్సరాలు దాటిన పెన్షనర్లు వీడియో కాల్ ద్వారా లేదా ప్రత్యక్షంగా నైనా ట్రెజరీ అధికారులను కలిసి లైఫ్ సర్టిఫికెట్ను అప్డేట్ చేసుకోవాలని ఆయన కోరారు.