హైదరాబాద్ : ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ షార్ప్ తన ఇండియా బిజినెస్ ఛైర్మన్‌గా సుజరు కరంపురిని నియమించింది. ఆయన డిస్‌ప్లే వ్యాపారానికి నాయకత్వం వహిస్తారని పేర్కొంది. దేశంలో షార్ప్ బ్రాండ్ ఉనికిని మెరుగుపరుస్తారని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. టి వర్క్స్ సిఇఒగా, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎండిగా పని చేసిన అనుభవం కరంపురికి ఉంది.