- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ నేపథ్యంలో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమం కేసులో తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ అయ్యాయి. రేపు విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో కవితతో పాటు మరో 12 మంది బీఆర్ఎస్ నాయకులపై కూడా కేసులు నమోదయ్యాయి. రైల్వేచట్టాల ఉల్లంఘన, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
- Advertisement -



