నవతెలంగాణ-హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం వరుస తీర్మానాలను ప్రవేశపెడుతోంది. మొన్న రాష్ట్రగీతం, నిన్న నీట్.. నేడు డీలిమిటేషన్‌పై తీర్మానాలను తీసుకువచ్చింది. నియోజకర్గాల పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్రం తీసుకువచ్చిన బిల్లును వ్యతిరేకించింది. అదే సమయంలో మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇచ్చింది. ప్రస్తుతమున్న 543 సీట్లతోనే దానిని అమలు చేయాలని విజయ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేశాయని ఈ సందర్భంగా సీఎం విజయ్ అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నష్టం వాటిల్లొచ్చని హెచ్చరించారు. ‘‘ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను అలాగే కొనసాగించాలి. ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం కేటాయించిన స్థానాలను శాశ్వతం చేయాలి. రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి’’ అని కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచారు.



