Wednesday, August 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహెచ్‌సీయూలో గంజాయి కలకలం..17 మంది విద్యార్థులకు పాజిటివ్

హెచ్‌సీయూలో గంజాయి కలకలం..17 మంది విద్యార్థులకు పాజిటివ్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) క్యాంపస్‌లో గంజాయి విక్రయం కలకలం రేపింది. ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 మంది విద్యార్థులు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. అస్సాం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న హెచ్‌సీయూ పూర్వ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది, ఎన్ని రోజులు నుంచి ఈ దందా కొనసాగుతుంది అనే కోణంలో విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -