రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలి

Support price should be provided for the crop grown by the farmer– పార్లమెంటులో సమగ్ర చట్టం చేయాలి..
– ప్రజలకు ఇచ్చిన ఆరుగారంటీల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి..
– రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి..
– సీపీఐ(ఎం) కల్వకుంట్ల గ్రామ శాఖ మహాసభలో మాట్లాడుతున్న  ిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
రైతుల పండించిన పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించడంతోపాటు, పార్లమెంటులో సమగ్ర చట్టం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి  అన్నారు. ఆదివారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో కామ్రేడ్ పగిళ్ల చిన్న నరసింహ నగర్ లో జరిగిన సీపీఐ(ఎం) 17వ గ్రామ శాఖ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక రైతుల పట్ల వివక్ష చూపుతుందని అన్నారు.  రెండు సంవత్సరాల నుంచి దేశం నడిబొడ్డున రైతులు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, రైతుల మీద అక్రమ కేసులు పెట్టడం తప్ప రైతుల యొక్క సమస్యలు పరిశీలించడంలో మోడీ విఫలమయ్యారని అన్నారు. కేంద్ర బడ్జెట్లో రైతాంగానికి తగిన బడ్జెట్ కేటాయించకపోడం సిగ్గుచేటు అన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో కంటే ఈసారి బడ్జెట్లో రూ.19వేల కోట్లు తగ్గించారని కూలీల పట్ల కూడా మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు .రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, ప్రజలకు ఇచ్చిన ఆరు గారంటీలను అమలు చేయాలని, పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీని చేయాలని, రైతుల ఖాతాల్లో వెంటనే రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం గారు హాజరై మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కల్వకుంట్ల గ్రామానికి సౌకర్యవంతమైన రోడ్డు ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం లేక ఆ గ్రామ ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రించి ప్రయాణించాల్సిన పరిస్థితి దాపరిచిందని మండిపడ్డారు. కల్వకుంట్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, కల్వకుంట్ల నుంచి వెల్మ కన్నె వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్ , సహాయక కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు , గ్రామ శాఖ నాయకులు నారబోయిన నరసింహ ,పగిళ్ల మధు, బొందు చిన్న నరసింహ ,బొందు అంజయ్య, అయితగోని యాదయ్య, పగిళ్ల యాదయ్య, కట్ట మారయ్య, పుల్కారం అంజయ్య, జిల్లపల్లి యాదయ్య, పగిళ్ల వెంకన్న, కట్ట ఆంజనేయులు, బొందు సుందరయ్య, చేకూరి బిక్షం, కుక్కల బాలస్వామి, సింగపంగా లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love