ఆదరించండి మరింత అభివృద్ధి చేస్తా..

Support it will develop more..–  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర రమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్‌
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ, 6వ వార్డుల్లో ఇండ్ల పట్టాలు, మంచినీటి సమ స్యను పరిష్కరించి మీ ముందుకు వచ్చానని ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తానని భూపా లపల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంక టరమణారెడ్డి అన్నారు. గురువారం భూపాల పల్లి మున్సిపాలిటీ పరిధి 5,6 కృష్ణ, యాదవ కాలనీలో రమణారెడ్డి ఎన్నికల ప్రచారంలో పా ల్గొన్నారు. వార్డులలో కాలనీ వాసులను నేరుగా కలిసి ఇంటింటికి తిరుగుతూ నవంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో తనను గెలిపించాలని అభ్యర్థిం చారు. ఇన్‌చార్జి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వ రాజు సారయ్యతో కలిసి వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. రెండు వార్డుల్లో పర్యటించిన అనంతరం రమ ణారెడ్డి మాట్లాడారు. కృష్ణ కాలనీ, యాదవ్‌ కాలనీలోని ప్రజలకు 2018 ఎన్నికల ప్రచారంలో ఇండ్ల పట్టాల సమ స్యను, నీళ్ల సమస్యను లేకుండా చేస్తానని హామీ ఇచ్చా నని, దాని ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యే కంగా జీఓ ఏర్పాటు చేసి ఇండ్ల పట్టాలను అందిచారని అన్నారు. ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన గోదావరి జిల్లాలను అందిచామని తెలిపారు. ఇప్పటికే భూపాలపల్లి పట్టణాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌ సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. భూపాలపల్లికి మెడికల్‌ కళాశాల, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కార్యాల యాలను ప్రారం భించుకున్నామని అన్నారు. భూపాలపల్లి పట్టణానికి ఔట ర్‌రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, పట్టణానికి నాలుగు వైపులా స్మశాన వాటికలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇచ్చిన హామీలను దాదాపు 90శాతం పూర్తి చేసి ఓటు అడుగుతున్న క్రమంలో విజ్ఞులైన ప్రజలు మరో అవ కాశం కల్పించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌ వెంకటరాణిసిద్దు, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్‌ బుర్ర రమేష్‌గౌడ్‌, వార్డు కౌన్సిలర్‌ ఎడ్ల మౌనిక శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు సింగన వేణి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌ను ఆదరించాలి
గణపురం : నవంబర్‌ 30న జరిగే అసెంబ్లీ ఎన్ని కల్లో సింగరేణి కార్మికులందరూ పార్టీలకతీతంగా బీఆర్‌ ఎస్‌ పార్టీని గెలిపించాలని ప్రతి కార్మికుడు కష్టంలో నా శక్తి మేర పని చేశానని భూపాలపల్లి నియోజకవర్గ ిబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం సింగరేణి కాకతీయ ఖని 8 ఇంక్లైన్‌ ఓసిత్రీలో టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్‌ తో కలిసి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారుణ్య నియామకాలు చేపట్టి ఎంతోమంది సింగరేణి కార్మికుల కుమారులకు ఉద్యోగావకాశం కల్పించారని,మళ్లీ కెసిఆర్‌ ముఖ్యమంత్రి చేసుకుంటే రానున్న రోజులలో సింగరేణి సంస్థ మరింత బలోపేతం చేస్తారని అన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన, రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మైన్‌లను కూడా ప్రైవేటీకరణ చేయకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌ అన్నారు.
భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివద్ధి చేశారని మరొసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని కొండాపురం సీతారాంపురం, అప్పయ్యపల్లి, నగరంపల్లి గ్రామాలలో పర్యటించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఆయన మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి మూడు గంటలు కరెంటు ఇస్తామని చెప్పడం విడ్డూరం అన్నారు. కొంద రి సెంటిమెంట్‌ కు లొంగిపోతే బాధలు తప్పమన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోలసాని లక్ష్మీ నరసింహారావు బిఆర్‌ఎస్‌ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు మోతే కరుణాకర్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణ చంద్ర రెడ్డి, ఎంపీటీసీ మంద అశోక్‌ రెడ్డి, సర్పంచులు రామంచ భద్రయ్య, ఐలోని శశిరేఖ రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love