Thursday, July 23, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం మద్దతు

విద్యార్థులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం మద్దతు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నిరసన చేపడుతున్న విద్యార్థులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం మద్దతు ప్రకటించింది. నీట్‌ పేపర్‌ లీక్‌ ఆరోపణలు, ఢిల్లీలో ఆందోళనకారులపై జరిగిన పోలీసుల చర్యలను ఖండిస్తూ న్యాయవాదుల బృందం బుధవారం ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి’ అనే ప్రచారంలో భాగంగా సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ పీఠికను చదివారు.

న్యాయవాద వర్గం విద్యార్థులకు మద్దతుగా నిలిచిందని సీనియర్‌ న్యాయవాది, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి ఎస్‌. మురళీధర్‌ ఉద్ఘాటించారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని అన్నారు. విద్యార్థులకు జరిగిన అన్యాయం, పోలీసుల అరాచకత్వాన్ని వ్యతిరేకించేందుకు బార్‌ సభ్యులు ఏకమయ్యారని, వారికిపూర్తి న్యాయపరమైన మద్దతు అందిస్తామని న్యాయవాది అభయ్‌సింగ్‌ తెలిపారు. యువత హక్కులు సాధించడంపైనే ఈ సమావేశం పూర్తిగా దృష్టి సారించిందని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ పేర్కొన్నారు.విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -