
మండలంలోని చౌట్ పల్లిలో మహా శివరాత్రి సందర్భంగా కోటిలింగేశ్వర స్వామిని రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు గంగ ప్రసాద్ దీక్షితులు ఎంపీ సురేష్ రెడ్డిని పూలమాల, శాలువాతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం సురేష్ రెడ్డి గ్రామంలోని లక్ష్మీనారాయణ స్వామి మందిరాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.