జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

– ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
నవతెలంగాణ – సిరిసిల్ల
అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్న జూనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మందాటి శ్రీశైలం ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా మార్చి 30 నుంచి విధులకు హాజరు కావడం లేదు. నిబంధన ప్రకారం మందాటి శ్రీశైలం పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.

Spread the love