ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందజేశారు. మద్నూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ మద్నూర్ ఎంపీడీవో రాణి పోలింగ్ కేంద్రం ఏర్పాట్లను సామాగ్రిని పరిశీలించారు. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి భద్రత ఏర్పాట్లు చేసినట్లు సబ్ కలెక్టర్ కిరణ్మయి తాసిల్దార్ ఎండి ముజీబ్ ఎంపీడీవో రాణి తెలిపారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.