సన్న బియ్యం కార్యక్రమానికి హాజరుకాని తహశీల్దార్

Tahsildar not attending the Sanna Rice programనవతెలంగాణ – ముధోల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం ప్రారంభోత్సవం కార్యక్రమానికి మంగళవారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్,బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్   ప్రారంబించారు. అయితే  ముధోల్ తహశీల్దార్ శ్రీకాంత్ సన్న బియ్యం ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో చాలా మందికి రేషన్ కార్డులు రాలేదని గ్రామస్థులు  చెప్పారు. దీంతో ఈ విషయం తహశీల్దార్ కు చెప్పుదామని అనుకుంటే హాజరు కాకపోవటం పై పలువురు మండిపడ్డారు. తహశీల్దార్ హాజరు కాకపోవటం పై తో మండల ఆర్ఐ లు నారాయణ రావు పటేల్, సరస్వతి హాజరు అయ్యారు. దీంతో అర్హులైన తమకు రేషన్ కార్డులు రాలేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఆర్ఐ చే విచారణ జరిపి అర్హులకు రేషన్ కార్డులు  వచ్చేటట్లు చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో వారు శాంతించారు.  తహశీల్దార్ కార్యక్రమంకు ఎందుకు రాలేదని  ఆర్ఐ ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వ్యక్తిగత పనులు ఉండటం వల్ల తహశీల్దార్ రాలేకపోయారని ఆర్ఐ చెప్పారు. ఆయా మండలంలో సన్న బియ్యం ప్రారంభోత్సవం కార్యక్రమంకు తహశీల్దార్ లు హాజరు అయినప్పటికి  ప్రభుత్వ కార్యక్రమం కు  ముధోల్ తహశీల్దార్  హాజరు కాకపోవటం పై  విమర్శలకు దారితీసింది.
Spread the love