ఉప్పునుంతల మండలం కొరటికల్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మండలంలోని అంబేద్కర్ సంఘాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వినతి పత్రం అందజేయడం జరిగిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండల బాధ్యులు చింతల నాగరాజు, అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షులు ఆర్కపల్లి ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కొరకు గత వారం రోజుల క్రితం స్థానిక పంచాయతీ కార్యదర్శికి, ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసిన వారి నుండి అనుమతి రాకపోవడంతో బుధవారం మండల ఉపతహసిల్దార్ పరుశు నాయక్ కలిసి విగ్రహ నిర్మాణానికి అనుమతించాలని కోరి ఆయనకు వినతిపత్రం అందించారు. వినతి పత్రం స్వీకరించిన ఉప తాసిల్దార్ పరశు నాయక్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్వెం గారి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. యువత అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చి విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు బాలరాజు, ఎల్లయ్య, కెవిపి స్ మండల నాయకులు ప్రసాద్, లక్ష్మణ్, ప్రశాంత్, గ్రామ నాయకులు శ్రీశైలం, ఆనంద్, అనిల్, లక్ష్మయ్య, సైదులు,సాయిబాబు, దాసు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.