నవతెలంగాణ - హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రులతో పాటు తనను కూడా రహస్య ఆపరేషన్ల ద్వారా ఉచ్చులో బిగించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆయన బాంబు పేల్చారు. ఈ కుట్రల వెనుక ఉన్న 'పితామహుడు' ఎవరో తనకు తెలుసని వ్యాఖ్యానించి రాజకీయ వేడిని పెంచారు.
శుక్రవారం ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులను, పార్టీ నేతలను ట్రాప్ చేసేందుకు ఏజెంట్లను నియమించారని, వారికి ఆర్థికంగా సాయం కూడా చేశారని ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. తనను కలిసిన వ్యక్తుల వివరాలు, ఫొటోలు, అధికారిక రికార్డులు తన కార్యాలయంలో భద్రంగా ఉన్నాయని తెలిపారు. "గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు" కొందరు వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని ఉద్దేశించి పరోక్షంగా చురక అంటించారు. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
నన్ను ఉచ్చులో బిగించేందుకు కుట్రలు: సీఎం డీకే శివకుమార్
2 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)