నవతెలంగాణ - హైదరాబాద్ : తమిళనాడులోని తెన్‌కాసి జిల్లా పాన్‌మోళిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రెహమాన్‌ను భార్య అంసా నిషా తన ప్రియుడు ఇంద్రకుమార్‌తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెస్టారెంట్‌లో నిషాకు ఇంద్రకుమార్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె.. ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంద్రకుమార్ కారులో రెహమాన్‌ను తీసుకెళ్లి పాన్‌మోళి సమీపంలోని తోటలో హత్య చేశాడు. పది రోజుల తర్వాత మృతదేహాన్ని స్థానికులు గుర్తించగా.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.






కామెంట్‌లు (0)