నవతెలంగాణ - హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గురుకులంలోని వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు దిగిన నలుగురు విద్యార్థులు విషవాయువు కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులను విషు శర్మ (19), ఆర్యన్ పాండే (16), దేవాన్ష్ శర్మ (17), మను కటారే (22)గా గుర్తించారు. ఘటన అనంతరం గురుకులం యజమాని ఆశిష్ శర్మ పరారీలో ఉన్నాడు. నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించాయన్న ఆరోపణలపై మథుర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాటర్ ట్యాంక్‌లోకి దిగిన నలుగురు విద్యార్థులు మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)