నవతెలంగాణ - హైదరాబాద్: తిరుమల శ్రీవారి సర్వ దర్శన రద్దీ తగ్గుముఖం పట్టింది. ఎలాంటి ముందస్తు టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు క్యూలైన్‌లోని 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే మొత్తం 66,404 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.63 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
3 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)