Magazines

బండి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట

4 గంటల క్రితం

Bandi Bhagirath
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి మీడియా, సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

సదరు కేసులో తనకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరైనప్పటికీ, కొన్ని టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆ కేసుకు సంబంధించిన అంశాలను ప్రసారం చేస్తూ తమ కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ భగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి ఎలాంటి కంటెంట్‌ను ప్రసారం చేయవద్దని టీవీ ఛానెళ్లు, ప్రైవేట్ వ్యక్తులు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఆదేశించింది. గూగుల్, మెటా, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ సంస్థలు సంబంధిత కంటెంట్‌ను తక్షణమే తొలగించి, డిజిటల్ రికార్డులను భద్రపరచాలని సూచించింది.


ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్ శాఖలు, తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, సోషల్ మీడియా సంస్థలతో పాటు పలువురు ప్రైవేట్ వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్