నవతెలంగాణ - హైదరాబాద్ : దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి లక్షలాది మంది సొంతూళ్లకు వెళ్లే నేపథ్యంలో, రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. 30 మంది గ్రూప్‌గా బుక్ చేసుకుంటే గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల వద్దకే నేరుగా బస్సు వస్తుంది. విద్యార్థుల కోసం కాలేజీలు, హాస్టళ్ల వద్ద నుంచే ప్రత్యేక బస్సులు నడపనున్నారు. బుకింగ్స్ కోసం ఫోన్ నంబర్లు విడుదల చేశారు.






కామెంట్‌లు (0)