నవతెలంగాణ - హైదరాబాద్ : సౌదీ అరేబియాలో సోషల్ మీడియాలో చేసిన ఓ వ్యాఖ్య కారణంగా 24 ఏండ్ల శ్రీలంక వలస కార్మికుడు అనోజన్ శివరాసాకు మరణశిక్ష పడింది. అభ్యంతరకర వ్యాఖ్య చేశాడన్న ఆరోపణలపై తొలుత ఐదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించారు. అయితే అప్పీల్‌లో షరియా చట్టం కింద విచారించి శిక్షను మరణశిక్షగా మార్చారు. అనోజన్ కుటుంబం శ్రీలంక అధ్యక్షుడిని కలిసి క్షమాభిక్ష కోరింది. అతడిని కాపాడేందుకు శ్రీలంక ప్రభుత్వం దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది.
సోషల్ మీడియా కామెంట్.. సౌదీలో శ్రీలంక యువకుడికి మరణశిక్ష
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)