నవతెలంగాణ - హైదరాబాద్ : రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులకు పాల్పడింది. రాజధాని మాస్కో ప్రాంతంలోని ఆయిల్ రిఫైనరీలపై 650 డ్రోన్లతో దాడి చేసింది. అలాగే రష్యా తీర ప్రాంతమైన సోచిలో ఓ ఆయిల్ ట్యాంకర్‌పై కూడా దాడి చేసింది. ఆ షిప్పులో ఉన్న 23 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని రష్యా వెల్లడించింది. దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.






కామెంట్‌లు (0)