అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోండి

Take measures to curb illegal sand transport– గంజాయి కేసుల్లో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచుతూ గంజాయి కిట్లతో తనిఖీలు చేయాలి
– వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ – సిరిసిల్ల
అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోవాలని, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై నిఘా ఉంచుతూ గంజాయి కిట్లతో తనిఖీలు చేయాలని జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్  పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యక్రమంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో  వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులలో విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్ష జరిపి కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని,నేరం జరిగిన ఘటనా స్థలపరిశీలన , సాక్ష్యాధారాలు సేకరణ,కేసు నమోదు,నిందితుల అరెస్టు, దర్యాప్తు,ఛార్జిషీటు దాఖలు,కోర్టు ట్రయిల్స్ వరకు తీసుకోవలసిన చర్యల పై అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారిపట్ల సున్నితంగా వ్యవహరించవద్దని అధికారులను అదేశించారు. జిల్లాలో గంజాయి నిర్ములనకు కృషి చేయాలని ఆదేశించారు. అటవీ జంతువులను వేటాడే వారిపై నిఘా కఠినతరం చేయాలని, తరచు జంతువుల వేటకు పాల్పడే వారిపై  పిడి యాక్ట్ అమలు చేయాలని తెలిపారు.కుల పంచాయతీ పేరుతో కుల బహిష్కరణకు పాల్పడుతే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని,జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు మారుతి, అశోక్, ప్రశాంత్ రెడ్డి, పృథ్వీందర్ గౌడ్, ప్రేమనందం, ఐటి కోర్ ఎస్.ఐ కిరణ్, డిసిర్బీ ఎస్.ఐ జ్యోతి, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love